ETV Bharat / state

'మళ్లీ కరోనా పరీక్షలు.. లాక్​డౌన్​పై మంత్రివర్గంలో నిర్ణయం'

author img

By

Published : Jun 29, 2020, 1:51 PM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేలమందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Will continue corona Tests from tomorrow  sayas minister eetala rajender
రేపటి నుంచి మళ్లీ పరీక్షలు... లాక్​డౌన్​పై ఆలోచన చేయాలి: ఈటల

కరోనా పరీక్షల్లో భాగంగా రేపటి నుంచి పెద్దమొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడుతునట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఐసీఎంఆర్​ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్‌లో చికిత్స అందిస్తున్నామన్న ఆయన... రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడిన మంత్రి... అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ఆలోచన చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఈటల వివరించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నామని ఈటల తెలిపారు. ఆరోగ్య శాఖలో 250 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారనీ.. సామాజిక మాధ్యమాల్లో వైద్యులపై దుష్ప్రచారం తగదని సూచించారు. 184 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న మంత్రి... వారు కోలుకుని ప్రజలకు ధైర్యం ఇచ్చారని కితాబిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు.

"రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తాం. ఆరోగ్య శాఖలో 250 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులపై దుష్ప్రచారం తగదు."

----- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.