హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని మక్తా బహదూర్ అలీ కాలనీలో నలుగురిపై అడవి పందులు దాడి చేశాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అడవిపంది దాడిలో జంగయ్యతో పాటు ఆయన కొడుకు యాదగిరి, భార్య నర్సమ్మ, కోడలు మంజులకు గాయాలయ్యయి. ఇందులో జంగయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
తెల్లవారుజామున తలుపులు తెరుచుకుని బయటకు వచ్చిన జంగయ్యకు అడవి పందులు కనిపించాయి. కర్రతో వాటిని బెదిరించాడు. ఒక్కసారిగా రెండు పందులు జంగయ్యపై దాడికి దిగాయి. జంగయ్య తప్పించుకునే క్రమంలో ఇంట్లోకి వచ్చాడు. అయిన అవి వదిలిపెట్టకుండా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వారిపై దాడికి దిగాయి. ఇంట్లో ఉన్నవారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడగా... స్థానికులు అరవడం వల్ల పందులు పారిపోతాయి.
ఇవీ చూడండి: పసివాడి శరీరంలో 12 సూదులు.. ఎలా తట్టుకున్నాడో పాపం.!