భర్తను దారుణంగా కొట్టి... మర్మాంగం కోసిన భార్య ఉదంతం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో జరిగింది. పాణ్యం మండలం ఎస్ కొట్టాల గ్రామానికి చెందిన యూనుస్కు, గడివేముల మండలం సోమాపురం గ్రామానికి చెందిన హసీనాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు రావటంతో... హసీనా పుట్టింటికి వెళ్లిపోయింది. తాను పెట్టిన బంగారు ఇవ్వమని అడగటానికి వెళ్లిన యూనుస్పై భర్త, ఆమె బంధువులు దాడి చేశారు. కాళ్లూ, చేతులూ కట్టేసి... కారం కొట్టి చితకబాదారు. అనంతరం భర్త మర్మాంగాన్ని భార్య కోసింది. వెంటనే బాధితుడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య