ETV Bharat / state

జగన్​తో కేసీఆర్ చీకటి ఒప్పందం.. త్వరలోనే బయట పెడతాం: నాగం

రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకుపోతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని పోతిరెడ్డిపాడు వ్యతిరేక పోరాట కమిటీ మండిపడింది.

కృష్ణా నీటి తరలింపుపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : నాగం

author img

By

Published : Jun 15, 2020, 6:16 PM IST

Updated : Jun 15, 2020, 8:51 PM IST

కృష్ణా నీటి తరలింపుపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : నాగం

తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్ర సర్కార్ తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని పోతిరెడ్డిపాడు వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే వందల టీఎంసీల నీరు దోచుకున్నారని.. ఈ దోపిడీ ఇంకా విస్తరిస్తోందని మండిపడ్డారు. ఫలితంగా దక్షిణ తెలంగాణ నీరు ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిని మనం వాడుకోకపోతే మన హక్కులను కోల్పోతామని స్పష్టం చేశారు.

దక్షిణ తెలంగాణ ఎండిపోతోంది..

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపులు మోటార్లు, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ తప్ప ఏమి తెలియదని పేర్కొన్నారు. కృష్ణా నీళ్లు దోచుకుపోతే గోదావరి నీటిని ఎత్తిపోసి కమిషన్లు దోచుకోవాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెండు పంటలు పండిస్తుంటే మనం మాత్రం ఎండిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని నాగం అన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ సమావేశమయ్యాక కూడా ఏపీ సీఎం సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీవో ఇచ్చారని నాగం ఆక్షేపించారు.

ఆ చీకటి ఒప్పందాలను బయటపెడతాం..

ఏపీ 170టీఎంసీల నీరు దోచుకుందని నాగం పేర్కొన్నారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని...ఇప్పుడు మూడో పంటకూ సిద్దమవుతున్నారని తెలిపారు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుని.. తెలంగాణ తెచ్చుకుంటే.. కేసీఆర్‌ జగన్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణాలో నికర జలాలను కూడా తెలంగాణ వాడుకోలేదన్నారు. కృష్ణా నది కమిటీ అన్ని గ్రామాలు తిరుతుందని.. కేసీఆర్ లోపాయికారి ఒప్పందాలను బయటపెడుతుందని హెచ్చరించారు. తాము రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కృష్ణా నది జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, నేతలు మల్లు రవి, చల్లా నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. సాగుపై కీలక చర్చ

Last Updated : Jun 15, 2020, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.