ETV Bharat / state

Bharat Biotech: 'కొవాగ్జిన్‌'పై 23న డబ్ల్యూహెచ్‌ఓ భేటీ - Bharat Biotech latest news

'కొవాగ్జిన్‌' టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) నుంచి అత్యవసర వినియోగ అనుమతి సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ నెల 23న ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశాన్ని ఖరారుచేసింది.

WHO meeting on Bharat Biotech Kovaggin covaxin on 23rd of this month
Bharat Biotech: 'కొవాగ్జిన్‌'పై 23న డబ్ల్యూహెచ్‌ఓ భేటీ
author img

By

Published : Jun 19, 2021, 7:47 AM IST

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసి, తయారుచేస్తున్న 'కొవాగ్జిన్‌' టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌- ఈయూఎల్‌) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ విషయంలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ దాఖలుచేసిన ఆసక్తి వ్యక్తీకరణను (ఈఓఐ) ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆమోదించింది. ఈ నెల 23న ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశాన్ని ఖరారుచేసింది.

టీకా నాణ్యత, సామర్థ్యం, వినియోగించిన టెక్నాలజీ.. తదితర అంశాలను ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓకు భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు వివరించే అవకాశం లభిస్తుంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో నూతన లేదా లైసెన్సు లేని ఔషధాలు/ టీకాలను ఒక క్రమపద్ధతిలో వినియోగించడానికి ఈయూఎల్‌ నిబంధనలను డబ్ల్యూహెచ్‌ఓ తీసుకొచ్చింది. దీనికింద ‘కొవాగ్జిన్‌’ టీకాకు అనుమతి పొందడానికి ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తగిన సమాచారాన్ని అందించింది.

ఈ నేపథ్యంలో ఈఓఐను ఆమోదించడంతో పాటు ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశం తేదీని డబ్ల్యూహెచ్‌ఓ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడినుంచి ఇంకా రెండు దశలున్నాయి. అత్యవసర అనుమతి పొందడానికి ఈ దశలూ పూర్తికావాలి. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భారత్‌ బయోటెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకూ 5 సంస్థల టీకాలకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి లభించింది. ఇందులో ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, సినోఫార్మ్‌, సినోవ్యాక్‌ టీకాలున్నాయి.

ఇదీ చూడండి: బ్లాక్‌ ఫంగస్‌ ఎలా ప్రవేశిస్తుంది? ఎవరిలో ఎక్కువ ముప్పు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.