ETV Bharat / state

Duplicate seeds: నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై ఉక్కుపాదం - Police action on Duplicate seeds

రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలు (Duplicate seeds) విక్రయించేవారిపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ.. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాలు (Duplicate seeds) కొని నష్టపోకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. ఎరువుల దుకాణాల్లోనూ సోదాలు చేసి నిషేధిత మందులు విక్రయించొద్దని సూచిస్తున్నారు.

seeds
నకిలీ విత్తనాలు
author img

By

Published : Jun 4, 2021, 5:16 AM IST

నకిలీ, గడువుతీరిన విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని హైదరాబాద్‌ ఎల్బీనగర్ ఎస్వోటీ (Lbnagar SOT) పోలీసులు అరెస్ట్ చేశారు.

వినాయక ట్రేడర్స్ పేరిట..

మాడ్గుల మండలం పాతబ్రాహ్మణపల్లికి చెందిన వెంకటయ్య వినాయక ట్రేడర్స్ పేరిట.. విత్తనాల విక్రయం వ్యాపారం చేస్తున్నాడు. దుకాణంలో గడువు తీరిన పత్తి విత్తనాలు సహా నిబంధనలకు విరుద్ధంగా పత్తి ప్యాకెట్లు నిల్వ చేశాడన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సోదాల్లో రూ. 43 లక్షల విలువైన 2,835 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లను జప్తు చేశారు. గడువు తీరిన విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో హైదర్‌గూడ, నారాయణగూడలోని పలు విత్తన దుకాణాల్లో పోలీసులు దాడులు చేశారు.

సొంతంగా తయారు చేసిన మందులపై కంపెనీ లేబుళ్లు అంటించి అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఎరువుల దుకాణాల్లో సోదాలు చేశారు. నకిలీ, గడువుతీరిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చర్యలు తప్పవు...

సిద్దిపేట జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ప్రాంత ఐజీ స్టీపెన్ రవీంద్ర (Ig stephen ravindra) స్థానిక పోలీసులకు సూచించారు. ప్రజ్ఞాపూర్‌లో ఏసీపీ కార్యాలయంలో నకిలీ విత్తనాలపై స్థానిక పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ రాజేశ్​ చంద్ర... కిసాన్‌చౌక్‌లో విత్తన విక్రయ దుకాణాలను పరిశీలించారు. రశీదులు లేకుండా విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పీడీ యాక్ట్...

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రోల్లపహాడ్‌లో ఓ వ్యక్తి ఇంటి సమీపంలో 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వాటి విలువ సుమారు రూ. 64 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. భువనగిరిలో గడువు ముగిసిన విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ (PD) యాక్ట్ కేసులు పెడతామని డీసీపీ నారాయణరెడ్డి (Dcp Narayana reddy) హెచ్చరించారు.

పోలీసుల సోదాలు...

జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, మల్లకల్, ధరూర్, గద్వాల మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. గద్వాల కొండపల్లి రోడ్డులోని రమ్య ఇండస్ట్రీలో 72 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో విత్తనాలు, పురుగుల మందుల దుకాణాల్లో 3 పోలీసులు బృందాలు సోదాలు చేశాయి. శ్రీ శ్రీనివాస దుకాణంలో మూడు క్వింటాళ్ల ఫోరేట్ లభించింది. శ్రీనివాస ట్రేడర్స్ దుకాణ యజమాని ఇంట్లో 218 లీటర్ల నిషేధిత గ్లైసోఫెట్ మందును పట్టుకున్నారు.

ఇదీ చూడండి: Telangana Council: ప్రొటెం ఛైర్మన్​గా ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.