ETV Bharat / state

Speaker Tammineni : కబడ్డీ ఆడుతూ.. పడిపోయిన సభాపతి - స్పీకర్​ తమ్మినేని సీతారాం వార్తలు

Speaker Tammineni : క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడారు. అయితే.. ఆట ఆడే క్రమంలో అదుపు తప్పడంతో.. కింద పడిపోయారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది.

Speaker Tammineni
Speaker Tammineni
author img

By

Published : Dec 23, 2021, 5:51 PM IST

Speaker Tammineni Fell down : కబడ్డీ ఆడుతూ ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ అదుపుతప్పి కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కళాశాల మైదానంలో ‘సీఎం కప్‌’ నియోజకవర్గ స్థాయి పోటీలను స్పీకర్‌ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు వారితో కలిసి సరదాగా ఆయన కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోయారు. వెంటనే అక్కడున్న వారు స్పీకర్‌ను పైకిలేపారు. క్రీడల్లో ఇలాంటివి మామూలేనంటూ తిరిగి ఉత్సాహంగా ఆటలో పాల్గొన్నారు.

కబడ్డీ ఆడుతూ.. పడిపోయిన ఏపీ సభాపతి

ఇదీ చూడండి: Floating Solar Power Plant: రామగుండంలో ఫ్లోటింగ్​ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం పూర్తి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.