గాంధీ ఆసుపత్రిలోని సేవా భారతి ఆశ్రమానికి అసోసియేషన్ ఆఫ్ ఇంటర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సోలార్ వేడి నీళ్ల ప్లాంట్ను అందజేశారు. ఈ ప్లాంట్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, క్లబ్ అధ్యక్షురాలు మమత కలిసి ప్రారంభించారు. వేలాది మంది రోగులకు చలి కాలంలో ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ అధ్యక్షురాలు మమత తెలిపారు. నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ఇవీ చూడండి:'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం'