ETV Bharat / state

స్వచ్ఛమైన తేనె తయారీకి కాసింత కష్టం చాలు..! - తేనె పట్టు ద్వారా తేనె ఉత్పత్తి పెంచడం

స్వచ్ఛమైన తేనె తయారీకి రైతులు కాసింత కష్టపడితే వారి పంట దిగుబడులు పెరుగుతాయి. విచ్చలవిడిగా రసాయన మందులను పంటలపై చల్లాల్సిన అవసరం ఉండదని, దీనివల్ల సాగు వ్యయం తగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. పలు ఉద్యాన, నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలు సాగుచేసే చేలతో తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా పలు లాభాలున్నట్లు ‘భారత నూనెగింజల పరిశోధన సంస్థ’(ఐఐఓఆర్‌), రాష్ట్ర ఉద్యానశాఖ జరిపిన అధ్యయనంలో గుర్తించారు.

తేనే పంట సాగు
honey, honey produce
author img

By

Published : Apr 11, 2021, 9:05 AM IST

పలు ఉద్యాన, నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలు సాగుచేసే చేలతో తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా పలు లాభాలున్నట్లు ‘భారత నూనెగింజల పరిశోధన సంస్థ’(ఐఐఓఆర్‌), రాష్ట్ర ఉద్యానశాఖ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. పొద్దుతిరుగుడు, బత్తాయి, కానుగ, నువ్వులు, కంది తదితర పలు పంటల సాగు చేస్తున్న చేలలో లేక వాటికి పక్క ఖాళీ భూముల్లో తేనెటీగల పెంపకానికి ప్రత్యేకంగా పెట్టెలు పెట్టారు. వీటిలోకి చేరిన తేనెటీగలు తోటల్లో చెట్లపై ఉండే పూలపైకి చేరి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల పూత నిలబడి కాత అధికమై దిగుబడి 15 నుంచి 30 శాతం దాకా పెరుగుతున్నట్లు ఐఐఓఆర్‌ పరిశోధనల్లో నమోదు చేశారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు వంటనూనెను అధికంగా వాడుతున్నారు. ఈ పంట సాగు తెలంగాణలో పెద్దగా లేదు. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ పంట వేసిన చోట తేనెటీగల పెంపకంతో పొద్దుతిరుగుడు పూలపై గింజల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఐఐఓఆర్‌ శాస్త్రవేత్తలతో పాటు రుతిక ఇన్నోవేషన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ తేల్చాయి.

చేలలో తేనెటీగల పెంపకానికి పెట్టెల ఏర్పాటు తద్వారా రైతులకు అదనపు ఆదాయం పూలపై పరపరాగ సంపర్కంతో దిగుబడి అధికం నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల పంటచేలలో చేపట్టిన తేనెటీగల పెంపకంతో ఎన్నో సత్ఫలితాలు వచ్చాయి. ఈగలు అధికంగా ఉన్న చేలలో పూత, కాత, దిగుబడి పెరిగి రైతులకు అదనపు ఆదాయం వస్తోంది. తేనెటీగలు పెంచితే తెగుళ్లు, రసాయనాల పిచికారి సగానికి తగ్గుతుందని తమ పరిశోధనలో తేలింది. - ఇందిరారెడ్డి, రుతిక ఇన్నోవేషన్స్‌ డైరెక్టర్.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం వేంపాడు, గుంటుపల్లి తదితర గ్రామాల్లో బత్తాయితో పాటు, ఇతర పంటలున్నచోట రైతులు ప్రయోగాత్మకంగా పెట్టెలు పెట్టి తేనెటీగల పెంపకం చేపట్టారు. గుంటుపల్లి రైతుల్లో అవగాహన కల్పించి అక్కడ 40 చోట్ల పెట్టెలను బీకీపర్స్‌ ఫామ్‌ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన లక్ష్మి ఏర్పాటు చేయించారు.

రైతులకు ఆదాయం పెరుతుంది
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అటవీ ప్రాంతాల సమీపంలో పంటలు సాగుచేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల పంట చేలలో తేనెటీగల పెంపకంతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని మేం గుర్తించాం. స్వచ్ఛమైన తేనె కిలో రూ.800కి కొనుగోలు చేస్తామని పలు కంపెనీలు అడుగుతున్నాయి. ప్రతీ రైతు తేనెటీగల పెంపకం చేపట్టేలా ప్రోత్సహిస్తాం. ప్రతి తోటలో కనీసం 2 లేదా 3 పెట్టెలు పెడితే అందులో తేనెతుట్టెలు పెట్టి తేనెటీగలు అక్కడే తిరుగుతూ పూలపై వాలి పరపరాగ సంపర్కానికి తోడ్పడతాయి.

-ఎల్‌.వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, రాష్ట్ర ఉద్యానశాఖ

ఇదీ చూడండి: హైదరాబాద్ యువతికి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.