ETV Bharat / state

పెద్దన్న పాత్ర పోషించాల్సిన పార్టీకేమైంది? - కాంగ్రెస్ తిరోగమనం

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోందని రాజకీయ విశ్లేకులు అంచనా వేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళం విప్పాల్సిన హస్తం నేతలు మిన్నకుండిపోతున్నారన్నారు.

పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది
author img

By

Published : Jul 24, 2019, 11:07 AM IST

ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిన కాంగ్రెస్‌... మీడియా సమావేశాలకే పరిమితమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందనే వాదన వినపడుతోంది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు దీటుగా ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పార్టీ మిన్నకుండిపోతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

'అధికారం దూరమైన వైఖరి మారట్లేదు'

2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తున్నామనే భావనను తీసుకురాగలిగినా.. చివరకు ప్రజల నుంచి ఓట్లను రాబట్టలేకపోయింది. తెరాస​ భారీ ఆధిక్యతం సాధించి అధికారంలోకి రాగా కాంగ్రెస్‌ మాత్రం 2014లో వచ్చినన్ని సీట్లు కూడా సాధించలేకపోయింది. రెండోసారి కూడా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోలేకపోయిందనేది విశ్లేషకుల వాదన.

నాయకత్వ వైఫల్యం...

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా.. వాటిని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన తప్పిదాల కారణంగా 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నా.. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యపై ప్రధాన ప్రతిపక్షంగా క్షేత్ర స్థాయిలో పోరాటం చేయలేకపోయిందని విమర్శించారు.

'సొంతంగా చేసిన ఆందోళనలు లేవు'

రాష్ట్రంలో కరవు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్నా... తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేక పోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీపీఐ, జనసమితి తదితర పార్టీలు, ప్రజా సంఘాలు ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు. కానీ ఇతర పార్టీల సహకారంతో చేసిన ప్రజా ఆందోళన కార్యకలాపాలు తప్ప సొంతగా చేసింది ఒక్కటి కూడా లేదు.

'పోరాటాలకు సిద్ధం కావాలి'

సరైన ప్రణాళిక లేమి.. రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. పార్టీ వైఖరి మారలేదు. ఇటీవల నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని కాషాయం జెండా రెపరెపలాడించింది. క్రమంగా రాష్ట్రంలో భాజపా బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్‌ నేతలు తమ వైఖరిని మార్చుకుని ప్రజా క్షేత్రంలో పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉందని సూచిస్తున్నారు.

పెద్దన్న పాత్ర పోషించాల్సిన పార్టీకేమైంది?

ఇవీ చూడండి : 'సహ చట్టాన్ని రద్దు చేసే దిశగా ఎన్డీఏ చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.