ETV Bharat / state

మొదట్నుంచి చెబుతున్నాం.. అదే నేడు నిజమైంది : ఉత్తమ్

రాష్ట్రంలోని ప్రాజెక్టులు నాసిరకంగా నిర్మించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఊర్లన్నీ మునిగే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొదట్నుంచి చెబుతున్నాం.. అదే నేడు నిజమైంది : ఉత్తమ్
మొదట్నుంచి చెబుతున్నాం.. అదే నేడు నిజమైంది : ఉత్తమ్
author img

By

Published : Jun 30, 2020, 8:58 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతి భారీగా జరుగుతోందన్న కాంగ్రెస్‌ వాదన నిజమైందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అవినీతి కట్టలు తెగుతున్నాయన్న ఉత్తమ్.. సోమవారం మిడ్ మానేరు, ఆదివారం కొండపోచమ్మ కాలువ, మంగళవారం ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌస్​కు పోయే కాలువకు గండ్లు పడ్డాయని విస్మయం చెందారు. చిన్న ప్రవాహానికే కొట్టుకుపోతే ఇక వరదలు వస్తే ఊర్ల పరిస్థితి ఏంటని ప్రభుత్వన్ని ప్రశ్నించారు.

నష్టాన్ని కాంట్రాక్టర్లే భరించాలి..

జరిగిన నష్టం మొత్తం కాంట్రాక్టర్లే భరించాలని డిమాండ్ చేశారు. నాణ్యతా లోపాలు, జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాక ముందే.. రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫామ్​ హౌస్​కు వెళ్లే కాలువ పనుల్లోనే నాణ్యత ఇంత అధ్వాన్నంగా ఉంటే.. మిగిలిన కాలువలు, జలాశయాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాగే జలాశయాలకు గండిపడితే ఒక్క ఊరూ మిగలదన్నారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు నీటితో కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : కొండపోచమ్మ కాల్వకు గండి.. నీట మునిగిన ఇళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.