రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదుల్లో బహుమతులు పంపిణీ చేయనున్నట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సచివాలయంలో మైనార్టీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్‌తో కలిసి పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మేలో ప్రారంభం కానున్న ప్రార్థనలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందుకై లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రార్థనా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వేసవి దృష్ట్యా మెడికల్ క్యాంపులు
వేసవిని దృష్టిలో పెట్టుకుని మసీదు ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి... ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈసారి కూడా చార్మినార్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఇంటర్ బోర్డు ముట్టడి... ఉద్రిక్తత