ETV Bharat / state

వారపు సంతలుంటేనే మంచిది ! - వారపు సంతలుంటేనే మంచిది !

హైదరాబాద్​లోని ప్రతి కాలనీలో ఒకటి, రెండు కూరగాయలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వారాంతంలో మార్కెట్‌కు వెళ్లి కాయగూరలు కొన్నా.. మధ్య మధ్యలో రోజువారీ అవసరాలకు స్థానికంగా విక్రయించేవారిపైనే ఆధారపడతారు. ఇక్కడే అన్నిరకాల కూరగాయలతోపాటు అన్నీ దొరుకుతాయి. ఈ దుకాణాలు ఇంటి నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటాయి. ప్రభుత్వమే ఈ దుకాణాలకు సరకును సరఫరా చేయగలిగితే బాగుంటుందని స్థానికులంటున్నారు.

ప్రతీ వారం సంత జరగడం మేలు
ప్రతీ వారం సంత జరగడం మేలు
author img

By

Published : Mar 27, 2020, 8:01 AM IST

హైదరాబాద్​ మహానగరంలో స్థానికంగా వారపు సంతలుంటే ఎక్కడో దూరంలో ఉండే రైతు బజార్ల వరకు వాహనాలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు. పైగా అక్కడ రద్దీగా ఉంటుంది. నిత్యావసరాల్లో ప్రస్తుతం కూరగాయలకే డిమాండ్‌ అధికం. వీటి ధరలేమో కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య, మధ్యతరగతి వాసులు కాయగూరల ధరలు చూసి హడలిపోతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుత లాక్‌ డౌన్‌ కాలంలో కొన్నింటి ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి. సాధారణంగా రూ.10కి ఒక మామిడికాయ అమ్ముతుంటారు. పండగ రోజు రూ.35కు విక్రయించారు. కొనలేక పండగ రోజు ఉగాది పచ్చడిలో పులుపు లేకుండానే కొంతమంది కానిచ్చేశారు. ఇంత ధరలేంటి అని కూరగాయల వ్యాపారులను అడిగితే హోల్‌సేల్‌ మార్కెట్లోనే మాకు ఎక్కువ ధర పడితే తక్కువ అమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇష్టారీతిన...

అధిక ధరలపై అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నా.. రైతుబజార్ల వరకే ధరల నియంత్రణ తప్ప మిగతాచోట్ల ఇష్టారీతిగా అమ్ముతున్నారు. ప్రభుత్వం ఇంటింటికి కాకపోయినా కనీసం స్థానిక దుకాణాల వరకు సరకును అందజేయగల్గితే ధరల నియంత్రించవచ్చు. అంతేకాదు ఆయా కాలనీల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. పగలు ఎప్పుడైనా వచ్చి కొనుగోలు చేయవచ్చు కాబట్టి జనం ఒక్కసారిగా గుమికూడే అవకాశం ఉండదు. ప్రస్తుతం పాల ప్యాకెట్లను తయారీదారులు దుకాణాల వద్ద ఉదయాన్నే సరఫరా చేస్తోంది. సర్కారే లాక్‌డౌన్‌ కాలంలో నిత్యావసరాలను స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తే ధరల అదుపు కూడా ఉంటుంది.

వారాంతపు మార్కెట్ల వేళలు మారిస్తే..

ప్రతి నాలుగైదు కాలనీలకు కలిపి ఒకచోట వారాంతపు సంతలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఒక కాలనీలో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. సౌకర్యంగా ఉంటూనే ఈ సంతలు బాగా విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం వీటి వేళల్ని మార్చాల్సి ఉంది. సాధారణంగా ఇవి సాయంత్రం పూట జరుగుతుంటాయి. పగలే నిర్వహించేలా చర్యలు తీసుకోవచ్చు. కూరగాయల దుకాణాలు దగ్గర దగ్గరగా కాకుండా ఒక్కోదాని మధ్య మీటర్‌ దూరం ఉండేలా ఆదేశించవచ్చు. సంతలు నిర్వహించేది రహదారులపైనే కాబట్టి ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కాలంలో రోడ్లన్నీ ఖాళీనే. ఒక్కో దుకాణం మధ్య దూరం ఉంటేనే కొనుగోలుదారులు సైతం గుంపుగా చేరకుండా నివారించవచ్చు.

వీధుల్లో తిరిగే బండ్లు పునరుద్ధరిస్తే..

కూరగాయలను ఇది వరకు నాలుగు చక్రాల బండిపై వీధి వీధి తిరుగుతూ విక్రయించేవారు. ఇటీవల ఈ బండ్లే కనిపించట్లేదు. ఈ-కామర్స్‌, సూపర్‌మార్కెట్‌ సంస్థల నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లతో వీటికి గిరాకీ తగ్గిపోయింది. మళ్లీ తోపుడు బండ్ల అవసరం కనిపిస్తోంది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో తోపుడు బండ్లు, సైకిళ్లు, మోపెడ్‌పై కూరగాయలు అమ్మేవారిని ప్రోత్సహించాలి. చాలా మంది ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారికి వెసులుబాటు కల్పించి అనుమతిస్తే జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా నివారించవచ్చు.

ఇవీ చూడండి : లాక్​డౌన్ : ఇంట్లోనే జాలీగా ఇలా గడిపేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.