ETV Bharat / state

Webinar:ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజాద్రోహానికి ఒడిగట్టారు - కృష్ణానది జలాల వివాదం

హైదరాబాద్​లో కృష్ణా నదీ జలాలు- తెలంగాణ ప్రభుత్వ విధానం అనే అంశంపై వెబినార్‌ (Webinar) నిర్వహించారు. ఈ వెబినార్‌లో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram), మాజీమంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో పలువురు విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు.

Webinar
వెబినార్‌
author img

By

Published : Jun 26, 2021, 3:56 PM IST

కృష్ణా నదీ జలాలు- తెలంగాణ ప్రభుత్వ విధానం అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్త అధ్వర్యంలో వెబినార్‌ నిర్వహించారు. ఈ వెబినార్‌లో తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, మాజీమంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో పలువురు విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఉద్యమ లక్ష్యాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేవలం గుత్తేదార్ల ప్రయోజనాలు వారి ద్వారా తనకు జగన్​కు నెరవేరే ప్రయోజనాలు తప్పితే ప్రజలను పట్టించుకోవడంలేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. కృష్ణా నది మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాద్రోహానికి పాల్పడిందని మండిపడ్డారు.

811 టీఎంసీలలో మనకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే చాలని స్వయంగా ముఖ్యమంత్రి అనడం శోచనీయమన్నారు. మన న్యాయమైన వాటా మనకు దక్కాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా బేసిన్​లో రాయలసీమ వాడుకుంటున్న వాటా రెండో క్రాప్​కు కూడా తీసుకుంటున్నారని.. 512 టీఎంసీలు ఆంధ్రాకు ఇచ్చి తెలంగాణకు 299 ఇవ్వడం తప్పని మాజీమంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.

సంగమేశ్వర లిఫ్ట్ ఆలోచన జగన్​కు లేదన్నారు. కేసీఆర్​తో ప్రగతి భవన్​లో భోజనం చేస్తున్నపుడు పుట్టిన ఆలోచన సంగమేశ్వర లిఫ్ట్ అని ఆరోపించారు. రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ కొంత ఖమ్మం, వరంగల్ కూడా ఈ బేసిన్​లోవని నీటి పారుదల ఈ జిల్లాలకు పదిశాతం కూడా అందడం లేదని నాగం పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల్లో దాదాపు 70 లక్షల ఎకరాలు నీటి కోసం అల్లాడుతున్నాయని తెలిపారు.

కేసీఆర్ దుర్మార్గాన్ని నిలవరించకపోతే మన రిజర్వాయర్​లు కూడా తాకట్టు పెడుతారని విమర్శించారు. ఇప్పటికే రూ. 5 లక్షల అప్పు మన నెత్తి మీద పెట్టారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కృష్ణా నీటి దోపిడీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Bhatti: 'సంగమేశ్వరం పూర్తయితే... శ్రీశైలం, సాగర్​ ఎండిపోతాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.