ఒడిశా ఉత్తర ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొన్నిచోట్ల ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెద్దేముల్(వికారాబాద్ జిల్లా)లో 3.5, ఐజ(గద్వాల)లో 2.1, బెజ్జూరు(కుమురంభీం)లో 1.9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
రామగుండంలో 31, హైదరాబాద్‌లో 31.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 25, రామగుండంలో 26.6 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ నెల ఒకటి నుంచి 22 వరకూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 88.5 మిల్లీమీటర్లకు గాను 136.8 మి.మీ. కురిసింది. మరో మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు పడవచ్చని అంచనా.