పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర వాయుగుండముగా ఇవాళ ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నర్సాపూర్, విశాఖ మధ్య కాకినాడ దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పెనుగాలులతో పాటు కొన్నిచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బుధవారం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు వివరించారు. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది రెండురోజుల తరవాతే తెలుస్తుంది.
తీరం దాటే సమయంలో గంటకు 55కిలో మీటర్ల నుంచి 65 కిలో మీటర్ల గరిష్టంగా 75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చూడండి: కీలక సవరణల కోసం ప్రత్యేక సమావేశం