తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు.
మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనుంది. శుక్ర, శనివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ, నైరుతి దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆర్టీపీసీఆర్ పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి