రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.
వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు 42- 44 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: 'సాయంత్రంలోపు మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వండి'