దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శుక్రవారం ఆ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొంత భాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రాగల రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ రోజు నైరుతి, ఉత్తర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Etala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల