ETV Bharat / state

ఉపరితల ఆవర్తన ప్రభావం.. రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం - రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

WEATHER report of coming three days in telangana
రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
author img

By

Published : Jun 18, 2020, 4:51 PM IST

తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉండబోతోందో హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్​, పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వివరించింది.

దాని ప్రభావంతో గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.