రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య మధ్యప్రదేశ్లోని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 2.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: ప్రజల ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కాల్పులు