రాష్ట్రంలో రాగల మూడురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురొచ్చని వాతావరణ శాఖ సంచాలకులు ప్రకటించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురొచ్చని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పరిసరాల్లో సముద్రమట్టం నుంచి 4.5కిమీ వరకు వ్యాపించి ఉందని తెలిపింది. మరోక ఆవర్తనం ఉత్తర ఛతీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1కిమీ వ్యాపించి ఉందని వివరించారు.
నైరుతి రుతుపవనాలు ఈనెల 4న రాష్ట్రాన్ని తాకాయి. నైరుతి రాకతో తొలకరి జల్లులు పలకరించాయి. తర్వాత వాన జాడ లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వర్షాలను నమ్ముకుని సాగుకు దిగిన రైతులు విత్తులు నాటుకుని ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఈ సమయంలో వర్ష సూచన ఉపసమనం కలిగిస్తోంది.
ఇదీ చూడండి: Yadadri: యాదాద్రి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ