గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం, హెచ్‌ఓడీలతో గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఇవాళ సమావేశమయ్యారు. ఆసుపత్రి వైద్యుడు వసంత్ చేస్తున్న వ్యాఖ్యలు మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన ఆరోపణలుగా పరిగణిస్తున్నామని అన్నారు. మెడికల్ దుకాణాలు, క్యాంటిన్ నిర్వాహకుల నుంచి వసంత్ డబ్బులు డిమాండ్ చేశారని శ్రవణ్‌కుమార్ ఆరోపించారు.
ఆత్మహత్య యత్యానికి పాల్పడిన వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తే అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. టీజీడీఏ జీఎస్‌గా ఎన్నికైన తర్వాత వసంత్ ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు. మానసిక వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఉద్యోగంలోకి తీసుకోవాలని సూపరింటెండెంట్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : 'జుమ్మేరాత్ బజార్లో సగం ధరకే అమ్ముతా...'