బాలికలకు, మహిళలకు రక్తహీనతపై డాక్టర్ పద్మజ లోకిరెడ్డి అవగాహన కల్పించారు. రుతుస్రావం మొదలయ్యాక.. బాలికలు (ఎనీమియా) రక్తహీనతతో బాధ పడటం సాధారణమన్నారు. అలసట, ఏ పని పట్ల శ్రద్ధ పెట్టలేక పోవటం, వెంట్రుకలు రాలిపోవటం ఇలా అనేక ప్రభావాలకు లోనవుతారని అన్నారు. సీబీసీ పరీక్ష చేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. దేహంలో రక్తం ఎంత శాతం ఉంటుందనేది హీమో గ్లోబిన్ పరీక్ష ద్వారా తెలుస్తుందన్నారు.
ఐరన్ పదార్థాలనే ఎక్కువ తినాలి...
ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని బాలికలను కోరారు. మంచి ఆహారం, ఎక్కువ నీరు తాగడం, వ్యాయామం చేయటం, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. శానిటేషన్ ప్యాడ్స్‌ను పరిశుభ్రతతో వాడాలన్నారు. అదే సమయంలో బరువు పెరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
రక్తం ఎక్కువ పోతే వెంటనే డాక్టర్‌ను కలవాలని తెలిపారు. 12 ఏళ్ల తర్వాత హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని గుర్తు చేశారు. దీని ద్వారా సర్వైకల్ కేన్సర్‌ను నివారించవచ్చని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : బెదిరించి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి గెలిచారు: రేవంత్