రోడ్లపై ఉన్న ఆలయాలు, మసీదులు తదితర నిర్మాణాల తొలగింపుపై శాసనమండలిలో చర్చించినట్లు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు వెల్లడించారు. శాసనమండలి వద్ద మీడియాతో ఆయన మట్లాడుతూ.. నూతన పురపాలక చట్టంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఇవ్వడం వల్ల దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీకి అర్హులు అనే క్లాజ్‌ను చట్టంలో ప్రస్తావించలేదని చెప్పారు. ఇది ఒక పార్టీకి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు కల్పించడాన్ని భాజపా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
కలెక్టర్లకు ఆ అధికారం సరికాదు: ఎమ్మెల్సీ రాంచందర్ రావు - We oppose giving powers to the Collector
భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు శాసన మండలి వద్ద మీడియాతో మాట్లాడారు. నూతన పురపాలక చట్టంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను తొలగించే అధికారం కలెక్టర్ ఇవ్వడం సరికాదన్నారు.