CM KCR On 111 GO: జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని... వాటిని తొలగించి జీవోను ఎత్తివేస్తామని తెలిపారు. కేబినేట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రగతిభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా మరోసారి ఉద్ధృతంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ఆమోదించినట్లు కేసీఆర్ వెల్లడించారు.
కావేరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ విశ్వవిద్యాలయాలకు ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందన్నారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఆమోదం తెలిపినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించాం. జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. దీనిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేశాం. న్యాయపరమైన చిక్కులు తొలగించి జీవో 111 ఎత్తివేస్తాం. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తాం. రాష్ట్రంలో 6 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ఆమోదించాం.
-- సీఎం కేసీఆర్
ఇవీ చూడండి: