జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెరాస ప్రజాప్రతినిధులు విస్తృతంగా పాల్గొంటున్నారు. ముషీరాబాద్ అడికిమెట్లోని మెట్రో రెసిడెన్సీలో జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేసిందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భాజపా మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
తెరాస ప్రభుత్వం 450 సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పేరుకు పెద్ద కులం కానీ బ్రాహ్మణుల్లో కూడా అనేక మంది పేదలు ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చే రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ పోరులో వంద స్థానాలు సాధిస్తాం : కేటీఆర్