ETV Bharat / state

PV SINDHU : 'దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు సింధు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది'

ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యం సాధించడంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి రెండుసార్లు వరుసగా పతకాలు తేవడం పట్ల గర్వంగా ఉందన్నారు. గత మ్యాచ్‌లో ఓడినా అందులోనుంచి బయటపడి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రధాని మాటలు సింధులో స్ఫూర్తి నింపాయన్నారు.

PV SINDHU FAMILY reactions
PV SINDHU FAMILY reactions
author img

By

Published : Aug 1, 2021, 7:48 PM IST

Updated : Aug 1, 2021, 8:58 PM IST

PV SINDHU FAMILY: 'దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు సింధు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది'

టోక్యో ఒలింపిక్స్​లో పీసీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా తన ఫిట్​నెస్​ను కాపాడుకుంటూ కరోనా పరిస్థితుల్లోనూ ఒలంపిక్స్​కు వెళ్లడం సాహసమేనన్నారు. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్​లో పాల్గొనడం మాములు విషయం కాదని చెప్పారు. బంగారు పతకం విషయంలో నిరాశే ఎదురైనా కాంస్య పతక పోరులో సింధు చక్కటి ఆట తీరు కనబర్చడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ప్రధాని మాటలు సింధూలో ఎంతో స్ఫూర్తి నింపాయన్నారు. హైదరాబాద్ వచ్చాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సింధు కలుస్తుందని వెల్లడించారు.

పీపీ సింధు.. ఒలింపిక్స్​లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. వెళ్లేటప్పుడు పలు సూచనలు చేశా. నిన్న ఆమెతో మాట్లాడా.. ఓడినా చక్కగా ఆడావని చెప్పా.. ఈరోజు ఇంకా బాగా ఆడాలని చెప్పా.. నాకు గిఫ్ట్​గా మెడల్​ గెలవాలన్నాను. ఓటమి నుంచి కోలుకొని.. చక్కగా రాణించింది. కాంస్యం సాధించింది. ప్రధాని మోదీ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. 'సింధు ఆప్​ జావ్​.. ఆనేకా బాద్​ హమ్​ ఐస్​క్రీం ఖాయేంగే 'అంటూ ప్రోత్సహించారు. దేశానికి మరిన్ని పతకాలు తెచ్చేందుకు సింధు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

- పీవీ సింధు తల్లిదండ్రులు

ఇదీచూడండి: ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

Last Updated : Aug 1, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.