ETV Bharat / state

భాగ్యనగరానికి నీటి ముప్పు తప్పదా..! - jalamandali

గత మూడేళ్లుగా సరిపడ వర్షాలు లేకపోవడం వల్ల .... భాగ్యనగరానికి తాగునీటిని అందించే జలవనరులు అడుగంటిపోతున్నాయి. సింగూరు, మంజీరా నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో... అరకొర స్థాయిలో నీటిసరఫరా వల్ల ఒక్కో కాలనీకి ఐదు రోజులకోసారి పది రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లతోపాటు ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించినా పైసలు నీళ్లలా ఖర్చవుతున్నాయే తప్ప... నీటి కష్టాలు తీరడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భాగ్యనగరానికి నీటి ముప్పు
author img

By

Published : Jul 14, 2019, 6:05 AM IST

Updated : Jul 14, 2019, 10:03 AM IST

భాగ్యనగరానికి నీటి ముప్పు

దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన భాగ్యనగరానికి ఇప్పుడు పెనుసవాల్ ఎదురవుతోంది. జనాభాకు సరిపడ తాగునీరు లేక నగర నలువైపుల్లో వందల కిలోమీటర్ల దూరం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తోంది. మంజీరా, సింగూరు జలాలను నాలుగు దశల్లో నగరానికి తీసుకొచ్చింది. అవీ చాలకపోవడం వల్ల కృష్ణానది నుంచి మూడు దశల్లో, గోదావరి జలాలను కూడా సరఫరా చేస్తోంది.

ఉస్మాన్​, హిమాయత్​ సాగర్లే ఆధారం..

నగరంలో ప్రస్తుతం ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్లకు పైగా నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. సింగూరు, మంజీరాలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయింది. ఆ లోటును ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలతో భర్తీ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 87 మిలియన్ లీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 36 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతోంది. అలాగే జంటనగర వాసుల పాలిట జీవధారగా నిలిచే కృష్ణా నది నుంచి 1,256 మిలియన్ లీటర్లు, ఎల్లంపల్లి గోదావరి నుంచి 725 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు.

9.65 లక్షల నల్లా కనెక్షన్లు

హైదరాబాద్​లో మొత్తం 9.65 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 8 లక్షల 70 వేల 15 గృహ నల్లాలు, 31 వేల 301 వాణిజ్య కనెక్షన్లు. 1,762 బహుళ అంతస్తుల భవనాలు జలమండలి సరఫరా చేసే తాగునీటినే వాడుతున్నారు. వెయ్యి లీటర్ల నీటిని శుద్ధి చేసి నగరానికి తరలించడానికి జలమండలి 50 రూపాయలు ఖర్చు చేస్తోంది. అంత ఖర్చు పెట్టి శుద్ధి చేసిన తాగునీటిని రాయితీపై సాధారణ ప్రాంతాల్లో 10 రూపాయలకు అందిస్తుండగా... మురికివాడల్లో 7 రూపాయలకు సరఫరా చేస్తున్నారు.

400 మిలియన్​ గ్యాలన్లు మాత్రమే సరఫరా..

నగరానికి 600 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా... 400 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా అవుతోంది. 2021 నాటికి నగర జనాభా కోటిన్నర దాటే అవకాశం ఉండటం వల్ల సుమారు 750 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.

కాళేశ్వరంలో 10 శాతం తాగునీటికే..

కాళేశ్వరం ప్రాజెక్టులో 10 శాతం జలాలను కచ్చితంగా తాగునీటికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం బాహ్యావలయ రహదారికి ఆవల ప్రత్యేక రిజర్వాయర్లు నిర్మించి నగరానికి అవసరమైన మొత్తాని కంటే ఎక్కువగానే తాగునీటిని నిల్వచేయాలని భావిస్తోంది.

ఇవీ చూడండి: 'ఆచార్య జయశంకర్​​ దారిలోనే తెజస'

Last Updated : Jul 14, 2019, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.