ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం తగ్గుతోంది. జూరాల నుంచి 43,238 క్యూసెక్కులు విడుదల కాగా... జలాశయంలో 55,424 క్యూసెక్కులు నీరు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం 42,378 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేసింది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 843.20 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 66.83 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత