ETV Bharat / state

Water Festival in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సందడిగా మంచినీళ్ల పండుగ - Mission Bhagiratha in Telangana

Telangana Decade Celebrations 2023 : దశాబ్ది అవతరణ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా.. మంచినీళ్ల పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. మిషన్‌ భగీరథతో.. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీరిపోయిందని మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు మిషన్‌ భగీరథ మంచినీళ్ల సీసాలు పంపిణీ చేశారు.

Water Festival in Telangana
Water Festival in Telangana
author img

By

Published : Jun 18, 2023, 7:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సందడిగా మంచినీళ్ల పండుగ

Water Festival in across Telangana : ఊరూవాడా తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంచినీళ్లను పండుగను సందడిగా నిర్వహించారు. మేడ్చల్ మండలం డబిల్‌పూర్‌లో వేడుకల్లో.. మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. గతంలో రోజులో సగభాగం నీటి కోసం కష్టాలు పడాల్సి వచ్చేదని మిషన్‌ భగీరథతో ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. అనంతరం జవహర్​నగర్ నగరపాలక సంస్థ పరిధి బాలాజీ నగర్ ప్రధానరహదారిపై.. నీళ్ల బిందెలతో, బతుకమ్మ ఆటలతో నిర్వహించి భారీ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని సందడి చేశారు.

ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో.. మంచినీళ్ల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను జలమండలి ఎండీ దానకిషోర్‌తో కలిసి సన్మానించారు. తండాలు, గూడెంలకు తాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​ది అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. వెస్ట్​మారేడ్​పల్లిలోని మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 50 ఏళ్ల వరకు జంటనగరాల్లో తాగునీటి కష్టాలు రాకుండా.. బీఆర్ఎస్​ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తలసాని శ్రీనివాస్​​యాదవ్ వెల్లడించారు.

Mission Bhagiratha in Telangana : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వాటర్‌ గ్రిడ్ వద్ద మంచినీళ్ల పండగ కార్యక్రమానికి.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. వాటర్ గ్రిడ్‌ వద్ద శుద్ధిచేసే నీటి యంత్రాలని పరిశీలించారు. ఎండకాలంలో కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్నామని విద్యాసాగర్​రావు తెలిపారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచేలా ముఖ్యమంత్రి చేశారని ఆయన పేర్కొన్నారు .

మంచినీళ్ల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలతో మిషన్ భగీరథ నీళ్లు తాగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్‌ వేడుకల్లో.. ఆయన పాల్గొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు వద్ద.. మంచినీళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో తాగునీటి పండుగను.. ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

"గతంలో ఎండకాలం వచ్చిదంటే చాలు ఖైరతాబాద్ జలమండలి వద్ద ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఆపరిస్థితులు లేవు. 50 సంవత్సరాల వరకు జంటనగరాల్లో తాగునీటి కష్టాలు రాకుండా.. బీఆర్ఎస్​ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలు కనీసం నీటి సరఫరా గురించి ఆలోచన చేయలేదు." - తలసాని శ్రీనివాస్​యాదవ్, మంత్రి

ఇవీ చదవండి: Telangana Decade Celebrations 2023 : నేడు రాష్ట్రవ్యాప్తంగా 'మంచి నీళ్ల' పండుగ

'మిషన్​ భగీరథ.. మిగిలిన ప్రాజెక్టులు బాగున్నాయ్.. మహారాష్ట్రలో ఇలాంటివే కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.