సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ కింద ఉన్న బస్తీలో నీటి పొదుపు పై అవగాహన ర్యాలీని డిప్యూటి స్పీకర్ పద్మారావు, జీహెచ్ఎంసి కమిషనర్‌తో కలిసి నిర్వహించారు. నీటిని పొదుపు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటిని వృథా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఇబ్బందిగా ఉంటుంది. దీనిని గమనించి ప్రజలంతా జీహెచ్ఎంసి చేపడుతున్న కార్యక్రమంలో సమష్టి బాధ్యతతో పని చేస్తే విజయమంతం అవుతుందని డిప్యూటి స్పీకర్ తెలిపారు. నగరంలో చాలా చోట్ల నీరు వృథా అవుతుందని, దీనివల్ల రోడ్లు పాడవుతున్నాయని, నీటి పొదుపు పైన ప్రజలకు అవగాహన కల్పించాలనే ర్యాలీని నిర్వహించామని జీహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ తెలిపారు. నీటి రంగంలో లీడర్లను నియమిస్తున్నట్లు, నీటిని వృథా చేసిన ఇంటిపై ఎరుపు రంగును, పొదుపు చేసిన ఇంటిపై ఆకుపచ్చ రంగుతో చుక్కను పెడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:రెండేళ్లుగా ఇళ్ల మధ్యే మురికి కాలువ