ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ 70వ అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ తరఫున ఐదుగురు ఇంజినీర్లు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన దాదాపు 950 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, నాగార్జున సాగర్ ఆధునికీకరణ పనులు, ఎస్సారెస్పీ పరిధిలో అమలు చేసిన టెయిల్ టు హెడ్ విధానాలను రాష్ట్ర ఇంజినీర్లు అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేతో పాటు చీఫ్ ఇంజినీర్లు నరసింహ, హమీద్ ఖాన్, నాగభూషణ్ రావు, శంకర్ హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నీటిపారుదల, వ్యవసాయం అనుబంధరంగాల్లో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతికల పరిచయం, ఫలితాలు, వ్యవసాయ ఉత్పాదకత పెంచే పద్ధతులను అధ్యయనం చేసి ప్రపంచానికి చాటి చెప్పడం తదితర లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. మన అధికారులు ప్రస్తావించిన విధానాలపై ప్రశంసలు లభించాయి.
ఇదీ చూడండి: గోదారమ్మ సోయగం... మరో జలదృశ్యం ఆవిష్కృతం