ETV Bharat / state

Ward Office System in GHMC : జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలకు శ్రీకారం

author img

By

Published : Jun 16, 2023, 10:34 PM IST

GHMC Ward Offices : పురపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమయ్యేలా కార్యాలయాల్ని అందుబాటులోకి తెచ్చారు. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల ఉపయోగాల్ని.. నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Ward Office System in GHMC
Ward Office System in GHMC

జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలకు శ్రీకారం

Wards Governance in GHMC : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పురపాలక సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే సందర్భంగా పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అందుబాటులోకి తెచ్చారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు ప్రజా సేవకు అందుబాటులో ఉంటారని చెప్పారు. తద్వారా మెరుగైన ఫలాలు ప్రజలకు అందుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రజల వద్దకు పరిపాలన పేరుతో తీసుకొస్తున్న సంస్కరణలకు.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట బీకే గూడాలో సీఎస్ శాంతి కుమారితో కలసి వార్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే వార్డు కార్యాలయాలన్న మంత్రి.. ముఖ్యమంత్రి ముందు చూపుతోనే రాష్ట్రం మరింత దూసుకుపోతుందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు.

Ward Office System in GHMC : అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా, బాధ్యతగా ఉండాలని.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్‌లో వార్డు కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. బస్తీలలో ఎవరి సమస్యలు వారే.. వార్డు కార్యాలయాల ద్వారా పరిష్కరించుకునేలా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మల్లారెడ్డి వివరించారు.

RajaSingh criticism of ward offices : వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు పనులు అవుతాయన్న నమ్మకం తనకు లేదని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. వార్డు కార్యాలయాల్లో పది రోజుల తరువాత ఒక్క ఉద్యోగి కూడా ఉండరని రాజాసింగ్‌ సవాల్‌ విసిరారు. గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని గన్‌ ఫౌండ్రీ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ ప్రజల డబ్బును ప్రభుత్వం ఏ విధంగా వృథా చేస్తుందో అర్థమవుతుందని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యంగా.. ప్రభుత్వం హైదరాబాద్‌లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తోందని మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వివరించారు.

"పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరం. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే మా లక్ష్యం. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం. సహాయక పుర కమిషనర్ నేతృత్వంలో సమస్యల పరిష్కారం. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 1.25 కోట్ల జనాభా హైదరాబాద్‌లోనే ఉంది. హైదరాబాద్‌లో జనసాంద్రత విపరీతంగా పెరుగుతోంది. చిన్న మున్సిపాలిటీల్లో కూడా వార్డుకొక అధికారి అందుబాటులో ఉంటారు." -కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

ఇవీ చదవండి: KTR Speech at Ward Office Inauguration వికేంద్రీకరణ ప్రజలు కేంద్రంగా పాలనే మా లక్ష్యం

KTR Review: 'హైదరాబాద్‌లో వార్డు పరిపాలన పద్ధతికి త్వరలోనే శ్రీకారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.