హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ పసి ప్రాణాన్ని బలితీసుకొంది. ఓల్డ్ విలేజ్లో నివాసముంటున్నారు దామిని, యోగేష్ దంపతులు. వివాహమై నాలుగేళ్లైనా తరుచూ గొడవపడుతుండేవారు. మంగళవారం రాత్రి భార్య, భర్త గొడవపడ్డారు. మనస్తాపంతో దామిని పసి పాపతో సహా రెండో అంతస్తుపై నుంచి కిందకి దూకేసింది. ఘటనలో పసిపాప అక్కడికక్కడే మృతిచెందగా పాప తల్లి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న దామినిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. భర్తే ఆమెను తోసేసి పరారై ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కసాయి