ETV Bharat / state

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు: గవర్నర్

విజయం సాధించాలంటే కష్టపడడం ఒకటే మార్గమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. బాచుపల్లిలోని వీఆర్ఎస్​ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ స్కూల్​ 25వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.

VRS Residential School  25th Anniversary Celebrations
వీఆర్​ఎస్​​ విజ్ఞానజ్యోతి రెసిడెన్షియల్​ స్కూల్​ వార్షికోత్సవ వేడుకలు
author img

By

Published : Jan 31, 2020, 11:05 PM IST

వీఆర్​ఎస్​​ విజ్ఞానజ్యోతి రెసిడెన్షియల్​ స్కూల్​ వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్​ బాచుపల్లిలోని వీ​ఆర్ఎస్​​ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్​ పాఠశాల 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్​ సౌందర రాజన్​ హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని... వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాంకేతికత వృద్ధి చెందుతున్న ఈ తరుణంలో విద్యార్థులు కూడా జ్ఞాపకశక్తిలో ముందున్నారని... విద్యార్థులకు అనుకూలమైన రీతిలో విద్యా బోధన జరగాలన్నారు.

25 సంవత్సరాలుగా ఉత్తమ విద్యను అందిస్తూ... విద్యార్థులకు మహోన్నత భవిష్యత్తునిస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వల్లూరిపల్లి రాజా రామ్ మోహన్​రావు, రాజశేఖర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తల్లి మృతదేహాన్ని ప్రయోగశాలకు ఇచ్చిన ఆదర్శ వైద్యుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.