ETV Bharat / state

ఇవాళ్టి నుంచి డిజిటల్ పద్ధతిలో ఓటరు గుర్తింపు కార్డులు - Voter id cards in mobile phone

ఓటరు గుర్తింపు కార్డును తమ మొబైల్ ఫోన్​లోనే డౌన్​లోడ్ చేసుకొనే విధానాన్ని భారత ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించనుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇవాళ్టి నుంచి డిజిటల్ పద్ధతిలో ఓటరు గుర్తింపు కార్డులు

author img

By

Published : Jan 25, 2021, 5:07 AM IST

Updated : Jan 25, 2021, 6:39 AM IST

డిజిటల్ పద్ధతిలో ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఓటరు గుర్తింపు కార్డును తమ మొబైల్ ఫోన్​లోనే డౌన్​లోడ్ చేసుకొనే విధానాన్ని భారత ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించనుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఓటర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్​ల ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్​లో డౌన్​లోడ్ చేసుకొని కంప్యూటర్​ల ద్వారా ప్రింట్ తీసుకుని వడంతో పాటు మొబైల్​లోనూ ఎపిక్ కార్డును భద్రపరచుకోవచ్చు. కొత్తగా నమోదైన యువ ఓటర్లు నేటి నుంచి నెలాఖరు వరకు ముందుగా తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్​ల ద్వారా ఈ- ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. voterportal.eci.gov.in.nsvp.in పోర్టళ్లతో పాటు యాప్ డౌన్​లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్ల ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు.

ఇవీ చూడండి: సూరత్​లో తెలంగాణ అధికారుల మృతి.. మంత్రి సంతాపం

Last Updated : Jan 25, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.