ఓటుకు నోటు కేసులో అరెస్టయిన ఉదయ్‌సింహ బెయిల్ కోసం అనిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు ఉదయ్‌సింహ విచారణకు గైర్హాజరు కావడం వల్ల... అనిశా కోర్టు మూడు రోజుల క్రితం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులపై ఏసీబీ అధికారులు ఉదయ్ సింహను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా... నిందితుడికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అధికారులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు