సికింద్రాబాద్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ తరఫున మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని మక్తాల్లో రోడ్ షో నిర్వహించారు. కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :వయనాడ్ స్థానానికి రాహుల్ నామినేషన్