Volunteer Stopped Pension : ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు వాలంటీర్‌ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొన్న పింఛన్ల డబ్బులో దొంగ నోట్లు సరాఫరా చేసిన వాలంటీర్లు తాజాగా పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఎండుగుపాలెంలో పింఛన్ డబ్బులు ఇవ్వడానికి తన చుట్టూ తిప్పుకున్నాడు ఓ వాలంటీర్. చివరికి బాధితుడు గట్టిగా నిలదీయటంతో అసలు విషయం చెప్పాడు. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం దావల బాబు అనే వ్యక్తి డప్పు కళాకారునికి పనిచేస్తోన్నాడు.
దీంతో అతనికి ప్రభుత్వం నెలనెల పింఛన్ ఇస్తోంది. కానీ ఈ నెలలో మొదటి తేదీకే పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా.. వాలంటీర్ ఇంకా ఇవ్వలేదు. రోజూ తన వెంట తిప్పించుకొని ఇబ్బందికి గురిచేసేవాడు. చివరిగా లబ్ధిదారుడు నిలదీయటంతో అసలు విషయం చేప్పాడు. తనకు మటన్ అప్పుగా ఇవ్వాలని వాలంటీర్ ఓరోజు అడగ్గా.. అందుకు బాధితుడు నిరాకరించాడు. అది మనసులో పెట్టుకొని వాలంటీర్ పింఛన్ డబ్బులు ఇవ్వలేదని వాపోయాడు. చివరకు అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి: