నిహాల్‌కు చిన్నతనం నుంచి ఆవిష్కరణలంటే ఇష్టం. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని గూగుల్, యూట్యూబ్‌లలో కోడింగ్ నేర్చుకున్నాడు. చరవాణుల్లో ఇప్పటికే ఒక్కమాట చెబితే వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్‌లు అన్ని పనులు చేసిపెడుతున్నాయి. అయితే నిహాల్ రూపొందించిన జార్విస్ సాఫ్ట్‌వేర్ కేవలం చరవాణిలోనే కాకుండా నోట్‌ప్యాడ్, విండోస్, ఫైల్స్, మ్యాప్స్ ఇలా ఎక్కడైనా చెప్పిన మాటలకు అక్షర రూపాన్ని ఇవ్వగలదు. ముఖ్యంగా ఎక్కువగా టైప్ చేసేవారికి, అంధులకు ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగపడుతుందని నిహాల్ చెబుతున్నాడు. ఐరన్‌మ్యాన్ సినిమాలో వాయిస్ అసిస్టెంట్ జార్విన్‌ను స్ఫూర్తిగా తీసుకుని దీనిని రూపొందించినట్లు వెల్లడించాడు.
తదుపరి ప్రాజెక్ట్ అదే..
కళ్లద్దాలలో ఇమిడిపోయే కంప్యూటర్‌ను రూపొందించడమే తన తదుపరి ప్రాజెక్టు అని నిహాల్ చెబుతున్నాడు. జార్విస్ అనేది ఆ ప్రాజెక్టు కోసం ఉపయోగించే ఒక టూల్ మాత్రమే అని తెలిపాడు. తాను రూపొందించబోయే మోస్ట్ సింప్లిఫైడ్ పీసీకి వాయిస్ ఆధారిత కమాండ్స్‌ను ఈ జార్విస్ ఇస్తుందని వెల్లడించాడు. ఎలక్ట్రానిక్ శాస్త్రవేత్త కావడమే తన లక్ష్యమని నిహాల్ ధీమాగా చెబుతున్నాడు.
ప్రభుత్వ సహకారం ఉంటే..
త్వరలో ఈ సాఫ్ట్‌వేర్‌కు పేటెంట్ కోసం కృషి చేసి... భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు వచ్చేలా ప్రోత్సహిస్తామని నిహాల్ తండ్రి సమీర్ అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత సంస్థల... సహకారం, తోడ్పాటు ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఓ మంచి ఆవిష్కరణను రూపొందించిన నిహాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: 'అదృష్టం కలిసొస్తే ఈ సారి టైటిల్ పంజాబ్‌దే'