ఆభరణాలు వాటిని ధరించే వారి వ్యక్తిత్వాన్ని, అభిరుచిని తెలియజేస్తాయి. ప్రస్తుతం మహిళలు విభిన్న డిజైన్లు గల ఆభరణాలు ధరిస్తున్నారు. ఐతే పాతకాలం నాటి నగలకు సరికొత్త ట్రెండ్‌ను జోడిస్తూ అదిరే అభరణాలు రూపొందిస్తోంది విశేషిని రెడ్డి. మోడ్రన్ మహిళలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా 2019లో హైదరాబాద్‌లో హవ్య జ్యూవెల్స్ను ప్రారంభించింది.
విశేషినిరెడ్డికి చిన్నప్పటినుంచే ఆభరణాలంటే అమితాసక్తి. హైదరాబాద్‌లో పెరిగిన ఆమెకి నిజాం, మెుఘల్స్ కాలంలో వాడిన నగలంటే తెలియని ఇష్టం. ఆ ఇష్టాన్ని కెరీర్‌గా మార్చుకుంది ఈ అమ్మాయి. జెమలాజికల్ కోర్సు పూర్తి చేసి హవ్య జ్యూవెల్స్‌ని ప్రారభించింది. సాధారణ జ్యూవెల్లరీ దుకాణాల్లో తాము రూపొందించిన ఆభరణాలు మాత్రమే అందుబాటులో ఉంచుతారు.
కానీ హవ్య జ్యూవెల్లరీ మాత్రం వినియోగదారుల అభిరుచుల మేరకు విభిన్నమైన డిజైన్లు తయారు చేసి ఇస్తున్నారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారుచేసిన బంగారం, వెండి, ఫ్యాషన్ నగలు హైదరాబాద్ వాసులకు అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాదు ప్రత్యేకంగా నగల కోసం ఈ కామర్స్ వెబ్‌సైట్‌ని కూడా ఏర్పాటు చేశారు.
గతంలో అమ్మమ్మలు, నానమ్మలు గుండ్లహారం, గెంటీలు, మకన కుందనాలు వంటివి ధరించేవారు. ఈ కాలంలో వాటిని ఆధునికంగా తయారుచేసి అందిస్తున్నారు విశేషినిరెడ్డి. మిస్ ఇండియా మానస వారణాసి, అఖండ సినిమాలో హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్, మరో హీరోయిన్ అవికా గోర్‌లు కూడా హవ్య జ్యువెల్లరీ ఆభరణాలే వేసుకున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పాత అభిరుచులకు విశేషినిరెడ్డి ఎలా సరికొత్త హంగులు అద్దుతున్నారో.
ఆభరణాలతో పాటు వీరి కస్టమర్ సర్వీస్ నచ్చడంతో అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లిన తెలుగువాళ్లలో చాలామంది తమకు కస్టమర్లుగా ఉన్నారని విశేషిని రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా పెళ్లి కూతురుకు అవసరమైన నగలు, తల్లీ, కూతుళ్లకి ఒకేలా ఉండేటువంటి నగలు తయారుచేయమని వీరికి ఎక్కువగా ఆర్టర్లు వస్తున్నాయి. విశేషినిరెడ్డికి జెమలాజికల్ ఇంజనీరింగ్ పట్ల అవగాహన ఉండటంతో ఆభరణాల నాణ్యత, వాటి ధరలను కూడా వినియోగదారులకి అర్థమయ్యేలా వివరించగలుగుతోంది.
జ్యూవెల్లరీ రంగంలో అమ్మాయిలు సులువుగా రాణించలగరు. ఎందుకంటే.. మహిళలుకు ఎటువంటి ఆభరణాలు నచ్చుతాయో తెలుసు కాబట్టి. అందుకే జ్యూవెల్లరీ రంగంపై ఆసక్తి ఉండే అమ్మాయిలు పెట్టుబడి గురించి భయపడుకుండా ఇటువైపుగా అడుగేయండి. ప్రతిభ ఉంటే అవకాశాలు మీ అంతటా మీరే సృష్టించుకోగల్గుతారని విశేషిని రెడ్డి సూచిస్తోంది.
"సాధారణ జ్యూవెల్లరీ దుకాణాల్లో తాము రూపొందించిన ఆభరణాలు మాత్రమే ఉంటాయి. కానీ మాదగ్గర నియోగదారుల అభిరుచుల మేరకు విభిన్నమైన డిజైన్లు తయారు చేసి ఇస్తాం. అంతేకాదు ప్రత్యేకంగా నగల కోసం ఈ కామర్స్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాం. ఆభరణాలతో పాటు వీరి కస్టమర్ సర్వీస్ నచ్చడంతో అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి." -విశేషినిరెడ్డి హవ్య జ్యూవెల్స్ నిర్వాహకురాలు
ఇదీ చదవండి: Weather Report Of Telangana: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు