ETV Bharat / state

'వ్యాక్సిన్​ రెండు డోసుల వేయించుకున్నా కొవిడ్​ సోకింది..' - ap news

ఏపీలోని విశాఖ పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. వ్యాక్సిన్​ రెండు డోసులు వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు తెలిపారు.

author img

By

Published : Apr 16, 2021, 2:25 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు డివిజన్ జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్​కు కొవిడ్​ సోకింది. రెండు రోజుల క్రితం ఏజెన్సీలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్​ వేయించుకున్నా.. తనకు కరోనా సోకినట్లు లీలా ప్రసాద్ తెలిపారు.

అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికి తనకు కొవిడ్​ సోకిందని అన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైరస్​ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలంతా.. ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.