Cyclone Jawad warning for AP: తుపాను రక్షణ చర్యల్లో భాగంగా.. ఏపీలోని విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 3 ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తుపాను తీవ్రత దృష్ట్యా పాఠశాలలకు మూడు రోజులపాటు సెలవు ప్రకటించారు. రెండ్రోజులపాటు పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
control rooms in visakhapatnam: విశాఖపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విశాఖ కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 0891-2590100, 2590102, 2750089, 2750090, 2560820కు ఫోన్ చేయాలని సూచించారు.
-
DD intensified into CS 'JAWAD' at 1130HRS IST of 3rd December. To move northwestwards and reach north Andhra Pradesh–south Odisha coasts by 4th December morning. Thereafter, to recurve north-northeastwards and move along Odisha coast reaching near Puri around 5th December noon. pic.twitter.com/EODCKtvmzh
— India Meteorological Department (@Indiametdept) December 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">DD intensified into CS 'JAWAD' at 1130HRS IST of 3rd December. To move northwestwards and reach north Andhra Pradesh–south Odisha coasts by 4th December morning. Thereafter, to recurve north-northeastwards and move along Odisha coast reaching near Puri around 5th December noon. pic.twitter.com/EODCKtvmzh
— India Meteorological Department (@Indiametdept) December 3, 2021DD intensified into CS 'JAWAD' at 1130HRS IST of 3rd December. To move northwestwards and reach north Andhra Pradesh–south Odisha coasts by 4th December morning. Thereafter, to recurve north-northeastwards and move along Odisha coast reaching near Puri around 5th December noon. pic.twitter.com/EODCKtvmzh
— India Meteorological Department (@Indiametdept) December 3, 2021
Minister Avanthi Srinivas On Cyclone: బయటకు రావొద్దు: మంత్రి అవంతి
అతి ముఖ్యమైన పని ఉంటేనే తప్ప, ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ తుపాను విపత్తు నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Cyclone Jawad: తుపానుపై హైఅలర్ట్.. పాఠశాలలకు సెలవులు