ETV Bharat / state

అరకులో పరవశించే వాతావరణం... పర్యటకుల జోరు - అరకు విశేషాలు

అరకు... ఈ పేరు వింటే ఎత్తైన కొండలు... లోయలు... కనువిందు చేసే పచ్చని చెట్లు... వణికించే చల్లగాలులు గుర్తుకొస్తాయి. పరవశింపజేసే మంచుతెరలతో పాటు పసుపు వర్ణం పరుచుకున్న ప్రదేశాలూ అలరిస్తాయి. ఈ సీజన్‌లో అక్కడకు వెళ్లేందుకు పర్యటకులు ఆసక్తి చూపుతారు. అందంగా ముస్తాబైన వలిసె పువ్వులను తనివితీరా చూస్తూ... చరవాణీల్లో బంధిస్తారు. అలాంటి ప్రాంతాన్ని మనమూ ఓసారి చూసొద్దామా...?

అరకులో పరవశించే వాతావరణం... పర్యటకుల జోరు
author img

By

Published : Nov 12, 2019, 11:47 AM IST

విశాఖ మన్యం... పచ్చని ప్రకృతి అందాలకు నెలవు. చలికాలం వచ్చిందంటే చాలు...ఇక్కడ అందాలకు హద్దే ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అరకులోయ పరిసర ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. అరకు అందాలకు వన్నెతెచ్చే ప్రత్యేకతల్లో వలిసె పూలు మరీ ప్రత్యేకమని చెప్పాలి.

ఘాట్‌రోడ్డు దాటుకుని అరకులోయలోకి ప్రవేశించింది మొదలు వలిసె పూల అందాలు పర్యటకుల మదిని దోచుకుంటాయి. ఎప్పుడెప్పుడు ఆ పూలతోటలోకి అడుగుపెడదామా... వాటి మధ్య నిలబడి ప్రకృతి ఒడిలో ఒదిగిపోదామా అని ఎవరికైనా అనిపించక తప్పదు. సెప్టెంబరు నెలాఖరు నుంచి జనవరి మొదటి వారం వరకు మాత్రమే ఇవి దర్శనమిస్తాయి.

అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో మాత్రమే ఈ వలిసె పూలు కనిపిస్తాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లో మాత్రమే వలిసె తోటలు పెంచడం సాధ్యమవుతుంది. అరకు వచ్చే పర్యటకులతో ఈ అందాల తోటలు సందడిగా మారుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వలిసెల అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. ఆకర్షణీయమైన పసుపు పూలతోటల్లో ఫొటోలకు ఫోజులిస్తూ మురిసిపోతున్నారు.

అరకు వచ్చే పర్యటకులకు ఒకప్పుడు ఎటు చూసినా వలిసె పూలు కనిపించేవి. ప్రస్తుతం వీటిని తక్కువ విస్తీర్ణంలోనే పెంచుతున్నారు. పర్యాటకశాఖ చొరవ తీసుకుని వలిసె తోటల విస్తీర్ణాన్ని పెంచాలని పర్యటకులు కోరుతున్నారు.

అరకులో పరవశించే వాతావరణం... పర్యటకుల జోరు

ఇవి కూడా చదవండి:

ఆకాశన్నంటుతున్న ఉల్లి ధరలు.. అమ్ముకోలేని స్థితిలో రైతన్న

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.