యువ కళాకారులను ప్రోత్సహించేందుకు అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో వర్చువల్ నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. బెంగళూరుకు చెందిన రూపాంతర గాంధీ జయంతి అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన భావజాలాన్ని సంస్కృతి సంప్రదాయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అభినయ థియేటర్ ట్రస్ట్ నిర్వాహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు. కళాకారులు తమ చక్కటి నటనతో గాంధీ జయంతి నాటకాన్ని ప్రదర్శించి కళాభిమానుల సాహితీవేత్తలను ఆకట్టుకున్నారు.