శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. మలక్‌పేట్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, బంజారాహిల్స్‌లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఖమ్మంలో పువ్వాడ అజయ్
ఖమ్మం సిద్ధార్థ కళాశాలలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఓటు వేశారు. వనపర్తి ప్రభుత్వ కళాశాల మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా వేలేరులో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి... భద్రాద్రి జిల్లా దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఓటు వేయగా... నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదండరాం పరిశీలించారు.
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
హైదరాబాద్ తార్నాకలో భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు ఓటేశారు. హన్మకొండలో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, యువతెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ నర్సంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమయత్‌నగర్‌లోని ఉర్దూ పాఠశాలలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించున్నారు. విద్యావంతులు తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాగర్‌కర్నూల్ బాలుర ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి... జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓటు వేశారు.
ఓటేసిన కలెక్టర్లు
హైదరాబాద్ ఉప్పరపల్లిలో సీఎస్ సోమేశ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకోగా... రెడ్‌హిల్స్‌లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఓటు వేశారు. నారాయణపేటలో కలెక్టర్ హరిచందన, భువనగిరిలో కలెక్టర్ అనితారామచంద్రన్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ శర్మన్... ఓటర్లు, సిబ్బందిని కలుసుకుని ఎవైనా సమస్యలున్నాయా అని తెలుసుకున్నారు. నారాయణపేట్‌లోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ చేతన పరిశీలించారు.
ఇదీ చదవండి: తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా