ETV Bharat / state

'విపణికి సైబర్​ నేరాలతో సంబంధం లేదు' - vipani group latest news

సైబర్​ నేరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉందని, దాని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని విపణి గ్రూప్ అధినేత తెలిపారు. ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేషంలో తమ సంస్థ విపణి గ్రూప్‌ పేరుతో జరిగిన సైబర్ నేరాల గురించి వివరించారు.

vipani group pressmeet in press club 2023
'విపణికి సైబర్​ నేరాలతో సంబంధం లేదు'.. 'మేము వాటికి బాధ్యులం కాదు'
author img

By

Published : Mar 18, 2023, 10:55 AM IST

సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తమవ్వాలని, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఒకటికి రెండుసార్లు సంస్థ మూలాలను ఖరారు చేసుకోవాలని విపణి గ్రూప్ అధినేత పిలుపునిచ్చారు. సైబర్​ నేరాలు విపరీతంగా పెరుగిపోతున్న వేళ జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతో ఉందని.. అలాంటి నేరాల పట్ల ప్రజలకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని విపణి గ్రూప్ అధినేత ప్రజలకు తెలిపారు.

విపణి పేరుతో ఆర్థిక నేరాలు

'గత ఎనిమిదిన్నరేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలతో B2B అనుబంధం కలిగి ఉంది విపణి గ్రూప్. ఎన్నో దేశాలలోని మల్టీ నేషనల్ కంపెనీలకు ట్యాలెంట్ సపోర్ట్‌ను అందిస్తూ వస్తోంది. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో దాదాపు ఐదు వందల కంపెనీలకు మన హైదరాబాద్ కేంద్రంగా B2B సేవలు అందిస్తోంది. ఇటీవల కాలంలో దిల్లీ, ముంబయి కేంద్రాలుగా కొందరు సైబర్ నేరగాళ్లు విపణి గ్రూప్ కంపెనీ పేరును వాడుతూ కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిసింది. సోషియల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏవో టాస్క్‌లు అంటూ నిర్వహిస్తూ యువకులను మభ్యపెట్టి వాళ్ళ నుంచి డబ్బులు సేకరిస్తున్నారని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీల నమ్మకాన్ని సొంతం చేసుకున్న మా కంపెనీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాలని చూడలేదు. మా సంస్థ కేవలం ఎమ్ఎన్సీ కంపెనీలకు సేవలు అందిస్తుంది అంతే తప్ప సోషియల్ మీడియాలలో వ్యక్తిగతంగా సంప్రదించదు. వ్యక్తులతో నేరుగా వ్యాపారం చేస్తుంది కానీ సోషల్ మీడియా ద్వారా ఎలాంచి లావాదేవీలు జరుపదని తెలిపారు. ఈ విషయాన్ని అందరి దృష్టికీ తీసుకురావాలని మీడియా ద్వారా తెలుపుతున్నాము' అని విపణి గ్రూప్ సీఈఓ సుధాకర్ కోలవెన్ను తెలిపారు.

న్యాయ పోరాటానికి సిద్ధం

'వ్యక్తిగతంగా సైబర్ నేరగాళ్ళతో మోసపోయిన కొందరు వ్యక్తులు తెలిపిన వివరాల ఆధారంగా మేము సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో కేస్ వేయడం జరిగింది. న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యాము. ఇందుకు కారణమైన వారికి శిక్ష పడేవరకూ పోరడతాం. తదుపరి.. మా కంపెనీ ద్వారా ఇలాంటి ఫేక్ ఆఫర్లు వినిపిస్తే వాటికి స్పందించకండి అని మీడియా ద్వారా విన్నవిస్తున్నామని' విపణి గ్రూప్ ప్రతినిధి రఘు పూలపల్లి తెలిపారు. మా సంస్థ పేరుతో జరిగిన మోసపూరితమైన చర్యల వల్ల జరిగిన నష్టానికి విపణి ఎలాంటి బాధ్యత వహించదని గ్రూప్ అధినేత తెలియజేశారు. అలాగే పౌరులు అందరూ ఇలాంటి సైబర్​ నేరాల వలలో చిక్కకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

విపణి సంస్థ

విపణి అనేది టాలెంట్ ఇండస్ట్రీ నుంచి ఉన్నతస్థాయి నిపుణులచే స్థాపించిన సంస్థ. దీనిని శ్రీ ప్రశాంత్ గుండ్ల, శ్రీ సుధాకర్ కోలవెన్నుల స్థాపించారు. ఈ సంస్థ ఎనిమిదిన్నర సంవత్సరాలుగా విజయవంతంగా మార్కెట్​లో దూసుకెళుతోంది. ఐటీ, ఇంజినీరింగ్, కృత్రిమ మేధ, బ్యాంకింగ్ వంటి రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా 500 కంటే ఎక్కువ క్లయింట్లకు వీరి సేవలను అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ ఎంతో మందికి తమ సేవలను అందించింది.

ఇవీ చదవండి:

దిల్లీ మద్యం కేసులో కొత్త ట్విస్ట్​.. ఈడీ చేతికి మరిన్ని సాక్ష్యాలు.. ఫోన్​ నుంచి డేటా మొత్తం..

TSPSC పేపర్​ లీకేజీ కేసు.. విదేశాల్లో ఉన్న బంధువులను తీసుకొచ్చి గ్రూప్‌-1 రాయించాడు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.