సమాజంలో మార్పు కోసం యువత సంఘటితంగా కృషి చేయాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డా. జయప్రకాశ్ నారాయణ అన్నారు. వాయిస్ ఆఫ్ విఐపి సంస్థ తార్నాకలో బ్లూమ్ 2019 కల్చరల్ ఫెస్ట్ ఫర్ విజువల్లి ఇంపెర్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు. దృష్టి లోపం ఉన్నవారు ఒక వైకల్యంగా భావించకుడదన్నారు. సమాజ అభివృద్ధికి తమవంతుగా తోడ్పాటును అందించాలన్నారు. దృష్టి లోపం ఉన్న సమాజాన్ని శక్తివంతం చేయడంలో కృషి చేస్తున్న వారిని ప్రశసించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వాయిస్ ఆఫ్ వీఐపీ సంస్థ సభ్యులకు, వాలంటీర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : గ్రేటర్ వరంగల్‌కు జపాన్ సాంకేతిక పరిజ్ఞానం