Vinod Kumar On Central Government: రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు మంజూరు చేయకుండా... విద్యావికాసానికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్‌లో ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్ వంటి విద్యాసంస్థలు మంజూరు చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నలుగురు భాజపా ఎంపీలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని.. తమతోనూ కలిసిరావడం లేదని వినోద్ కుమార్ విమర్శించారు.
రైతు బీమాపై వైతెపా అధ్యక్షురాలు షర్మిల వాస్తవాలు తెలుసుకోకుండా అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. ఎల్ఐసీ నిబంధనల మేరకే 60 ఏళ్ల లోపు వారికే బీమా పాలసీ చేయించామని స్పష్టం చేశారు. కేంద్రం, ఇతర రాష్ట్రాల్లోని బీమా పథకాలు కూడా 60 ఏళ్లలోపు వారికే వర్తిస్తున్నాయన్న విషయం షర్మిలకు తెలియదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై కేసీఆర్ సమీక్ష